ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 4:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటు హెచ్ఎంఎస్ – తెలంగాణ రక్షణ సేన గాంధేయమార్గంలో పోరాడి సాధించిన సంయుక్త విజయం

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా నెలల తరబడి కాలయాపన చేసిన అప్రజాస్వామిక కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరంకుశ సింగరేణి యాజమాన్యం మా ఉద్యమానికి దిగివచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు  కవిత వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు ఈనెల 17,  18 న మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నది.. ఇది వేలాది మంది సింగరేణి కార్మికుల గెలుపు. వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు. వేలాది మంది కార్మికులు అనారోగ్య సమస్యలతో మెడికల్ ఆన్ ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నెలల తరబడి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా వారి మనోవేదనకు కారణమవుతోంది. మేము ఉద్యమించామని ఇప్పుడు మాత్రమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయడం కాదు.. ప్రతి నెలా  మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలి. సింగరేణి కార్మికులు ఎవరిని సూచిస్తే వారికి వారసత్వ ఉద్యోగం ఇవ్వాలి.. మెడికల్ బోర్డు కు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్ ఫిట్ చేయాలని ఆమె అన్నారు.
=======================